Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత జట్టుతో జగన్‌మోహన్‌రావు
- నేటి నుంచి ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీ
లక్నో : ప్రతిష్టాత్మక ఆసియా మెన్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పోటీపడుతున్న భారత జట్టు కప్పుతో తిరిగి రావాలని జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోన్‌రావు అభిలాశించారు. సౌదీ అరేబియా వేదికగా నేటి నుంచి ఆసియా చాంపియన్‌షిప్ ఆరంభం కానుంది. సౌదీ అరేబియాకు బయల్దేరడానికి ముందు భారత జట్టు ఆటగాళ్లతో జగన్‌మోహన్‌రావు మాట్లాడారు. 'భారత్‌లో ఇప్పుడిప్పుడే హ్యాండ్‌బాల్‌కు ఆదరణ లభిస్తోంది. ఒలింపిక్స్ లక్ష్యంగా ఫెవరేషన్ కృషి చేస్తోంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకమే లక్ష్యంగా పోటీపడాలి. కప్పుతోనే తిరిగి రావాలని' జగన్ మోహన్ రావు అన్నారు.
ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీలో భారత్‌కు కఠిన డ్రా ఎదురైంది. టైటిల్ కోసం 16 జట్లు బరిలోకి దిగుతుం డగా.. కోవిడ్-19 తీవ్రతతో జపాన్, థారులాండ్ టోర్నీ నుంచి వైదొలిగాయి.
ఆతిథ్య సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇరాన్‌లతో పాటు భారత్ గ్రూప్-బిలో నిలిచింది. టోర్నీ ఆరంభ రోజు నేడు సౌదీ అరేబియాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.