Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే నా ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెన్ : సానియా మీర్జా
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగే టెన్నిస్ సీజన్ అనంతరం టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు బుధవారం వెల్లడించింది. సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నదియా కిచెనాక్(ఉక్రెయిన్)తో జతకట్టిన సానియా.. 4-6, 6-7(5-7)తో కాజ జువాన్-జిదాన్సేక్ చేతిలో తొలిరౌండ్లోనే ఓటమిపాలైంది. అనంతరం స్పందిస్తూ.. వయసు పెరుగుతోందని, శరీరం పూర్తిస్థాయిలో సహకరించడం లేదని, తన మూడేళ్ల కుమారుడిని దూరంగా పెట్టి టూర్ల పేరుతో తిరిగి తన కుమారుడి జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టదలచుకోలేదన్నారు.