Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బీసీసీఐ తాత్కాలిక షెడ్యూల్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ ఈ ఏడాది కాస్త ముందుగానే ఆరంభం కానుంది. భారత్‌లో కొవిడ్ మూడో వేవ్ ఉదృతి కొనసాగుతున్నప్పటికీ భారత్ వేదికగానే ఐపీఎల్ 15 నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 27న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు షెడ్యూల్ తయారు చేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రాంఛైజీల యాజమాన్యాలతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఐపీఎల్ వేదికపై ప్రాంఛైజీల అభిప్రాయాలను బీసీసీఐ పెద్దలు ఆలకించారు. ముంబయిలోనే.. : ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచులకు ముంబయి నగరం ప్రధాన ఆతిథ్య వేదికగా నిలువనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. గత సీజన్‌కు సైతం బీసీసీఐ ముంబయి వేదికగా రంగం సిద్ధం చేసినా చివరి నిమిషంలో ఏక కాలంలో రెండు నగరాల్లో మ్యాచుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ముంబయిలో ఎక్కువ స్టేడియాలు అందుబాటులో ఉండటంతో ప్రాంఛైజీల ప్రాక్టీస్‌కు సరిపడా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్‌ను రెండో వేదికగా ఎంచుకునే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. మార్చి చివరి వారంలోగా కోవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితి అదుపులోకి రానిపక్షంలో యుఏఈ, దక్షిణాఫ్రికాలను ప్రత్యామ్నాయ వేదికలుగా ఉంచుతున్నారు. యుఏఈలో మ్యాచుల ఫలితాలపై ప్రాంఛైజీలు ఏ మాత్రం సంతృప్తిగా లేవు. ప్రాంఛైజీ యాజమాన్యాలు ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించేందుకు మొగ్గుచూపుతున్నాయి.