Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆతిథ్యమివ్వనున్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం
న్యూఢిల్లీ : విస్తత సంప్రదింపులు, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని టోర్నీ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళలో ప్రస్తుతం కోవిడ్-19 ఉదతి, అక్కడి సంబంధింత శాఖల అధికారులతో చర్చల అనంతరం వేదికను కోచి నుంచి హైదరాబాద్‌కు మార్చారు. ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ లీగ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను నిర్వహించనున్నారు. టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. టోర్నీ'లో పాల్గొనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అధికారుల ఆరోగ్య భ్రదతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్న నిర్వాహకులు లీగ్‌ను పూర్తిగా బయో బబుల్‌లోనే నిర్వహించనున్నారు. కోవిడ్-19 మార్గదర్శకాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ టోర్నీ నిర్వహణకు ప్రణాళిక తయారు చేస్తున్నారు.
హైదరాబాద్‌కు ఎప్పటినుంచో గొప్ప క్రీడా సంస్కతి ఉంది. హైదరాబాద్‌లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రపంచ వ్యాప్త్తంగా ప్రతిభావంతులైన వాలీబాల్ క్రీడాకారులకు ఓ చక్కటి వేదిక ఏర్పాటుకు ఎంతగానో ఎదురుచూశాం. ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఆరంభం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నాం. వేదిక మార్పు నిర్ణయంలో సహకరించిన అన్ని జట్లకు ధన్యవాదాలు' అని ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈవో జో భట్టాచార్య అన్నారు.