Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరు ప్రకటించిన లక్నో ప్రాంఛైజీ
లక్నో : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన ప్రాంఛైజీ అధికారిక పేరును ప్రకటించింది. సంజీవ్ గోయెంకా లక్నో ప్రాంఛైజీని రికార్డు ధరకు లక్నో ప్రాంఛైజీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో రెండేండ్ల పాటు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ నిర్వహించింది. తాజా వేలంలో లక్నో ప్రాంఛైజీ దక్కించుకున్న ఆర్పీఎస్జీ గ్రూప్.. కొత్త ప్రాంఛైజీ పేరు సూచించమని సోషల్ మీడియాలో అభిమానుల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఈ మేరకు అభిమానులు సూచించినట్టు 'లక్నో సూపర్ జెయింట్స్' పేరు ఖరారు చేస్తూ ఆ జట్టు ట్విట్టర్లో ఓ వీడియో ఉంచింది. పేరు సూచనకు అభిమానుల నుంచి వచ్చిన స్పందనకు ప్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా కృతజ్ఞతలు తెలిపారు. ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలానికి ముందు లక్నో ప్రాంఛైజీ ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించనుండగా.. మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోరులను ఆ జట్టు ఎంచుకుంది. రూ. 17 కోట్ల రికార్డు ధరకు కెఎల్ రాహుల్‌ను లక్నో ఎంచుకున్న సంగతి తెలిసిందే.