Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో గట్టెక్కిన సిట్సిపాస్
- ఎదురులేని మెద్వదేవ్, సిన్నర్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్బోర్న్లో యువ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్ అలవోక విజయంతో క్వార్టర్ఫైనల్లో కాలుమోపగా.. గ్రీసు వీరుడు స్టెఫానోస్ సిట్సిపాస్ చెమటోడ్చి ప్రీ క్వార్టర్ఫైనల్లో గట్టెక్కాడు. మహిళల సింగిల్స్‌లోనూ స్టార్ క్రీడాకారిణులు జోరు చూపిస్తున్నారు. రెండో సీడ్ ఆర్యనా సబలెంకకు కానేపి షాక్ ఇచ్చింది. ఏడో సీడ్ ఇగా స్వైటెక్ అదిరే ఆటతో క్వార్టర్ఫైనల్లో కాలుమోపింది.
నవతెలంగాణ-మెల్బోర్న్
గ్రీసు వీరుడు, యువ క్రీడాకారుడు స్టెఫానోస్ సిట్సిపాస్ ప్రీ క్వార్టర్ఫైనల్లో చెమటోడ్చాడు. 20వ సీడ్ అమెరికా ఆటగాడితో ఐదు సెట్ల పోరులో పైచేయి సాధించింది. అతి కష్టంపై పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి చేరుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఫేవరేట్, రెండో సీడ్ రష్యన్ స్టార్ డానిస్ మెద్వదేవ్ తన జోరు చూపించాడు. అమెరికా ఆటగాడిపై వరుస సెట్లలో మెద్వదేవ్ అలవోక విజయం నమోదు చేశాడు. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్, కానేపి, కార్నెట్ సహా కొలిన్స్‌లు క్వార్టర్ఫైనల్లో కాలుమోపారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నేటి నుంచి క్వార్టర్‌ఫైనల్ సమరాలు షురూ కానున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో మడిసన్ కీస్, క్రిజికోవాలు తొలి క్వార్టర్స్‌లో.. వరల్డ్ నం.1 యాష్లె బార్టీ, పెగులా రెండో క్వార్టర్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో షపలోవ్, రఫెల్ నాదల్‌లు తొలి క్వార్టర్స్‌లో ఢ కొట్టనుండగా.. మోన్ఫిల్స్, బెరాటినిలు రెండో క్వార్టర్స్‌లో సమరానికి సై అంటున్నారు.
ఎదురులేని మెద్వదేవ్ : పురుషుల సింగిల్స్ సర్క్యూట్లో అత్యంత వేగంగా దూసుకొస్తున్న స్టార్ డానిల్ మెద్వదేవ్. అగ్ర క్రీడాకారులకు సవాల్ విసురుతున్న డానిల్ మెద్వదేవ్ (రష్యా) గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వేటలో తనదైన దూకుడు చూపిస్తున్నాడు. అమెరికా ఆటగాడు మాక్సిమె క్రిస్సెపై 6-2, 7-6(7-4), 6-7(4-7), 7-5తో మెద్వదేవ్ విజయం సాధించాడు. తొలి సెట్‌ను సులువుగా సొంతం చేసుకున్న మెద్వదేవ్.. రెండో సెట్ కోసం టైబ్రేకర్ వరకు పోరాడాల్సి వచ్చింది. మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన మెద్వదేవ్.. తర్వాతి సెట్లోనే క్వార్టర్స్ బెర్త్ బుక్ చేసుకున్నాడు. 7-5తో క్రిస్సేపై తిరుగులేని పైచేయి సాధించాడు. 15 ఏస్‌లు సంధించిన మెద్వదేవ్ మూడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. 18 డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన క్రిస్సీ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. పాయింట్ల పరంగా 156-138తో, గేముల పరంగా 26-20తో మెద్వదేవ్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపించాడు. యువ ఆటగాడు, గ్రీసు స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్ ప్రీ క్వార్టర్స్‌లో చెమటోడ్చాడు. 20వ సీడ్ అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోగొట్టుకున్నాడు. 4-6, 6-4, 4-6, 6-3, 6-4తో సిట్సిపాస్ ఐదు సెట్ల పోరులో గట్టెక్కాడు. టేలర్ 13 ఏస్‌లు కొట్టగా, సిట్సిపాస్ 19 ఏస్‌లు సంధించాడు. టేలర్ 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా.. సిట్సిపాస్ ఒక్కదానితోనే సరిపెట్టాడు. సిట్సిపాస్ మూడు బ్రేక్ పాయింట్లతో మ్యాచ్‌ను వశం చేసుకోగా.. టేలర్ రెండు పాయింట్లు సాధించాడు. సిట్సిపాస్ 151 పాయింట్లు గెల్చుకోగా, టేలర్ 144 పాయింట్లు సాధించాడు. స్వీయ సర్వ్‌లో 110 పాయింట్లు సాధించిన సిట్సిపాస్ ప్రత్యర్థి సర్వ్‌ను మూడు సార్లు బ్రేక్ చేశాడు. 11వ సీడ్ జానిక్ సిన్నర్ (ఇటలీ) వరుస సెట్లలో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌పై పైచేయి సాధించాడు. 7-6(7-3), 6-3, 6-4తో సిన్నర్ వరుస సెట్లలో సత్తా చాటాడు. 9 ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో చెలరేగాడు. మరో ప్రీ క్వార్టర్ఫైనల్లో మారిన్ సిలిచ్‌కు (క్రోయేషియా) పరాభవం తప్పలేదు. కెనడా ఆటగాడు ఫెలిక్స్ ఆగర్ అలిసిమె 2-6, 7-6(9-7), 6-2, 7-6(7-4)తో సిలిచ్‌పై గెలుపొందాడు.
స్వైటెక్ జోరు : ఏడో సీడ్ పొలాండ్ భామ ఇగా స్వైటెక్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 7-5, 3-6, 3-6తో సోరాన సిర్సిటీ పరాజయం పాలైంది. రెండు ఏస్‌లతో మెరిసిన స్వైటెక్ ఏకంగా ఆరు బ్రేక్ పాయింట్లు సాధించింది. 105-95తో పాయింట్ల పరంగా, 17-13తో గేముల పరంగా ప్రత్యర్ధిపై స్వైటెక్ పైచేయి సాధించింది. బెలారస్ భామ సబలెంకాకు ప్రీ క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అన్‌సీడెడ్ కానేపి చేతిలో మూడు సెట్ల పోరులో సబలెంకా చేతులెత్తేసింది. 7-5, 2-6, 6-7(7-10)తో సబలెంకా పరాజయం పాలైంది. సబలెంక మూడు బ్రేక్ పాయింట్లు సాధించగా, కానేపి నాలుగు బ్రేక్ పాయింట్లతో మెరిసింది. 14వ సీడ్ సిమోన హలెప్ (రోమానియా)కు సైతం పరాజయం తప్పలేదు. అన్‌సీడెడ్ అలిజె కార్నెట్ చేతిలో హలెప్ ఓటమి చెందింది. 4-6, 6-3, 4-6తో కార్నెట్‌కు క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్ కోల్పోయింది. 27వ సీడ్ అమెరికా అమ్మాయి డానిల్లె కొలిన్స్ 4-6, 6-4, 6-4తో ఎలిసె మార్టెన్స్పై గెలుపొందింది.