Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంక క్రికెటర్ దిల్రువాన్ పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ లంక క్రికెట్‌బోర్డు(ఎస్ఎల్సి)కు తన రిటైర్మెంట్ లేఖను పంపి, వెంటనే తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని బోర్డును కోరాడు. శ్రీలంక జాతీయ జట్టు తరఫున దిల్రువాన్ 41 టెస్టులు, 13 వన్డేలు, 3 టి20ల్లో ప్రాతినిధ్యం వహించారు. 41 టెస్టుల్లో 1,155 పరుగులు, 156 వికెట్లు తీసాడు. ఇక 13 వన్డేల్లో 152 పరుగులు, 13 వికెట్లు, మూడు టి20ల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి 3 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఉత్తమ బౌలింగ్ 6/32 కాగా.. 95 పరుగుల అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు.