Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: భారత వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఫిబ్రవరి 9నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌లకు జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్నెస్ టెస్ట్‌లో పాస్ అయినట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. ''అవును, రోహిత్ తన ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు మరియు వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌లో అతను జట్టుకు నాయకత్వం వహిస్తాడు'' అని ఆయన తెలిపారు. రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో వెస్టిండీస్‌తో సిరీస్‌కు జట్టుపై చర్చించేందుకు సెలక్షన్ కమిటీ నేడు సమావేశమైంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు అహ్మదాబాద్‌లో, టీ20 సిరీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి.