Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీ ఎంట్రీపై హర్బజన్ సింగ్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత సీజన్లో కోల్‌కత నైట్‌రైడర్స్ నెట్ సెషన్. దుబారులో కుల్దీప్ యాదవ్ బంతి ఆకాశంలోకి దూసుకెళ్లగా.. అతడి మోకాలి గాయానికి గురైంది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ముంబయిలో మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సర్జరీ అనంతరం కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది? తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగు పెడతాడనే విషయంలో ఎటువంటి స్పష్టత కనిపించలేదు. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో జాతీయ జట్టుకు దూరమైన కుల్దీప్ యాదవ్ తాజాగా తిరిగి భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత స్పిన్నర్లు తేలిపోయారు. దీంతో సెలక్టర్లు తిరిగి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపు చూశారు. కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీ ప్రయాణం అంత సులువు కాదని భారత దిగ్గజ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అన్నాడు. 'కుల్దీప్ యాదవ్ ముందున్న ప్రయాణం అంత సులువు కాదు. కుల్దీప్ యాదవ్ ఎటువంటి దేశవాళీ మ్యాచులు ఆడలేదు. నేరుగా అంతర్జాతీయ సర్క్యూట్లో రాణించటం కొంచెం కష్టమే. సర్జరీకి ముందు కుల్దీప్ రెగ్యులర్‌గా ఆడలేదు. పునరాగమనంలో ఆలోచించాల్సిన విషయం.. బ్యాటర్ల దాడికి గురి కాకుండా చూసుకోవటం. వైట్‌బాల్ క్రికెట్లో ఇది అత్యంత ముఖ్యం. భారత్‌కు చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన ఆటగాడు కుల్దీప్ యాదవ్. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగటం కీలకం అవుతుందని' హర్బజన్ సింగ్ అన్నాడు. విదేశీ గడ్డపై భారత నం.1 స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అని అప్పటి చీఫ్ కోచ్ రవిశాస్త్రి సిడ్నీ టెస్టు అనంతరం వ్యాఖ్యానించగా.. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ టెస్టు క్రికెట్లో కనిపించలేదు. ఐపీఎల్‌లోనూ నిలకడగా నిరాశపరిచిన కుల్దీప్ యాదవ్ క్రమంగా కోల్‌కత తుది జట్టులోనూ చోటు కోల్పోయాడు. వైట్ బాల్ ఫార్మాట్లో ప్రక్షాళనకు సిద్ధమవుతున్న సెలక్షన్ కమిటీ అనూహ్యంగా అసలు దేశవాళీ మ్యాచ్ ప్రాక్టీస్ లేని కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయటం విశేషం.