Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడున్నరేండ్లు వేటు వేసిన ఐసీసీ
దుబాయ్ : జింబాబ్వే మాజీ కెప్టెన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రమశిక్షణ నియామవళి కొరడా ఝులిపించింది. డోపింగ్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు బ్రెండన్ టేలర్‌పై మూడున్నర సంవత్సరాల నిషేధం విధించింది. ఈ మేరకు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ మూడున్నరేండ్ల నిషేధాన్ని బ్రెండన్ టేలర్ అంగీకరించినట్టు ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. బ్రెండన్ టేలర్ ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకోవటంపై ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. భారత్‌లో ఉన్న సమయంలో ఓ వ్యాపారితో కలిసి బ్రెండన్ టేలర్ కొకైన్ మాదకద్రవ్యాన్ని తీసుకున్నాడు. బ్రెండన్ టేలర్ కొకైన్ మాదకద్రవ్యాన్ని తీసుకుంటున్న దృశ్యాలను ఆ వ్యాపారి వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి స్పాట్ ఫిక్సింగ్ చేయాల్సిందిగా బ్రెండన్ టేలర్‌ను బ్లాక్మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయటంలో బ్రెండన్ టేలర్ జాప్యం చేశాడు. దీంతో ఐసీసీ నుంచి నిషేధం వేటు ఎదుర్కొవాల్సి వచ్చింది.