Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: వ్యాక్సినేషన్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తుండడంతో జోకో పాల్గొనడం అనుమానాస్ప దంగా మారింది. వ్యాక్సిన్ వేయించుకోని వారు నాలుగు నెలల్లో తమకు కరోనా వైరస్ పాజిటివ్ తేలిందని రుజువు చేయాల్సి ఉందని ఫ్రెంచ్ ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొనాల్సిన వారు ఈ పత్రం తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో మే 22 నుంచి షురూ కానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో జోకోవిచ్ పాల్గొనడంపై సందేహాస్పదంగా ఉంది. వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు జోకో చేసినా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆ టోర్నీలో పాల్గొనకుండానే ఘోర పరాభవంతో తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే.