Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : తమిళనాడు ధనాదన్ జోడీ షారుక్ ఖాన్, ఆర్. సాయి కిశోర్‌లకు బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ పిలుపు అందింది. నిరుడు శ్రీలంకలో పర్యటించిన ద్వితీయ శ్రేణి భారత జట్టుకు సైతం ఎంపికైన షారుక్ ఖాన్, సాయి కోశోర్లను రానున్న వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 16-20న కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 సిరీస్ జరుగనుంది. మూడు టీ20లకు షారుక్ ఖాన్, సాయి కిశోర్‌లు రిజర్వ్ ఆటగాళ్లుగా జట్టుతో పాటు ఉండనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.