Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాటర్‌గా లీడర్ పాత్ర పోషిస్తాను
- స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ : భారత క్రికెట్ నాయకుడిగా ఉండేందుకు జట్టుకు కెప్టెన్ మాత్రమే కానక్కర్లేదని, బ్యాటర్‌గా జట్టుకు ఎంతో చేయవచ్చని విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. టీ20 కెప్టెన్సీ వదులుకున్న విరాట్ కోహ్లికి షాకిచ్చిన బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం టెస్టు కెప్టెన్సీ నుంచి సైతం విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ' ప్రతి పదవికి, బాధ్యతకు ఓ కాల పరిమితి ఉంటుంది. ఆ విషయం మనకు తెలిసుండాలి. ఇతడు ఏం సాధించాడని జనాలు మాట్లాడవచ్చు కానీ ముందుకు సాగుతూ, మరిన్ని ఘనతలు సాధించినప్పుడు మన బాధ్యత పూర్తిచేశామనే భావన కలుగుతుంది. ఇప్పుడు బ్యాటర్‌గా జట్టుకు ఎంతో చేయవచ్చు. జట్టు మరిన్ని విజయాలు సాధించేలా చేయవచ్చు. నాయకుడిగా ఉండేందుకు కెప్టెన్‌గా ఉండనవసరం లేదు. ఎం.ఎస్ ధోని జట్టులో ఉన్నప్పుడు అతడు నాయకుడు కాదని కాదు, అతడి నుంచి మేము ఎప్పుడూ సలహాలు తీసుకున్నాం. టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన సమయంపై మాట్లాడుతున్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవటం సైతం నాయకత్వంలో భాగం. జట్టులో అదే కల్చర్ ఉంటుంది.
కొత్త ఆలోచనలు, కొత్త కెప్టెన్ దిశానిర్దేశనంలో, కొత్త మార్గంలో ప్రయాణం సాగుతుందంతే. అన్ని రకాల బాధ్యతలు, పాత్రలు పోషించాల్సి ఉంటుంది. నేను ఎం.ఎస్ ధోని కెప్టెన్సీలో ఆడాడు, జట్టు కెప్టెన్‌గా సుదీర్ఘకాలం పని చేశాను. రెండు సమయాల్లోనూ నా మైండ్‌సెట్ మారలేదు. నేను ఆటగాడిగా ఉన్నప్పుడు సైతం కెప్టెన్‌గానే ఆలోచించాను, జట్టును గెలిపించాలనుకున్నాను. నాకు నేనే నాయకుడిగా ఉండాలనుకుంటాను' అని విరాట్ కోహ్లి ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.