Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్(పికెఎల్) సీజన్-8లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్ విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 34-25 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. గుజరాత్ జట్టులో అజరు కుమార్(9), పర్దీప్ కుమార్(7) రైడ్‌లో రాణించగా.. హడి(4), రాకేశ్(4) ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక బెంగాల్ జట్టులో మణిందర్(9) ఒంటరి పోరాటం చేయగా.. రాన్ సింగ్(6) ఆల్‌రౌండ్ ప్రతిభ చూపాడు. గుజరాత్ జట్టు 2సార్లు బెంగాల్‌ను ఆలౌట్ చేయడంతో విజయం సాధించగల్గింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికే బెంగళూరు జట్టు 19-13పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది.