Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.305.58కోట్ల పెంపు మాత్రమే
- ఖేలో ఇండియా, జాతీయ యువజన పథకాలకే తొలి ప్రాధాన్యత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడలకు కంటితుడుపు నిధులను మాత్రమే పెంచింది. 2021 బడ్జెట్తో పోల్చి చూస్తే 2022లో కేవలం రూ.305.58కోట్లను మాత్రమే పెంపుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ క్రమంలో క్రీడలకు పెంపుదల చేసిన ఈ బడ్జెట్ ఎందుకూ పనికిరాదని క్రీడా ఆర్ధిక నిపుణులు మండిపడుతున్నారు. క్రీడలకు కేటాయించిన మొత్తంలో తొలి ప్రాధాన్యతగా ఖేలో ఇండియా, జాతీయ యువజన క్రీడలకు కేటాయించాలని పేర్కొంది. బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలిసారి రూ.2,596.14 కేటాయిస్తే.. గత ఏడాది దానిని రూ.2,757.02కోట్లకు పెంపు చేశారు. తాజాగా దీనినిని రూ.3,062.60 పెంచారు. క్రీడాకారుల శిక్షణ, సన్నద్ధత, పెరిగిన కేటాయింపుల గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. క్రీడలకు సంబంధించి బడ్జెట్లో ఈసారి కేవలం 30శాతం పెంపుదల మాత్రమే చేశారు.