Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింటర్ ఒలింపిక్స్‌లో వినూత్న ప్రయోగం
బీజింగ్: రెండు రోజుల్లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా.. చైనా ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి తెరలేపింది. హోటల్ గదులలో బసచేసే అథ్లెట్లు, ప్రతినిధులు, విఐపిలకు ఆహారం అందజేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రోబోట్ల ద్వారా ప్రతి రూమ్‌కు వారు కోరుకున్న మెనూలను అందజేయనున్నట్లు దానికి సంబంధించిన వీడియోను మంగళవారం ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రత్యక్షంగా ఆహారాన్ని అథ్లెట్లకు అందజేస్తే కోవిడ్-19 సోకే ప్రమాదముందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వింటర్ ఒలింపిక్స్ ఆటంకాల్లేకుండా జరుగుతాయనడానికి ఇది ఓ నిదర్శనమని ఈ క్రమంలో చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న ప్రయోగమనిఅద్భుతంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.