Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 12, 13న బెంగళూరులో వేలం
- 228మంది క్యాప్డ్, 355మంది అన్క్యాప్డ్, 7గురు ఇతర దేశాల క్రికెటర్లు
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) ఈ ఏడాది సీజన్ కోసం వేలం బరిలో 590మంది ఆటగాళ్లు నిలిచారు. ఈసారి ఐపిఎల్ వేలం బరిలో నిలిచిన మొత్తం 1,214మంది ఆటగాళ్లను ఫిల్టర్ చేసి తుది వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బిసిసిఐ మంగళవారం వెల్లడించింది. ఈ నెల 12, 13న రెండు రోజుల పాటు బెంగుళూరు వేదికగా ఐపిఎల్ వేలం జరగనుంది. మొత్తం 590 మంది ఆటగాళ్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్స్(అంతర్జాతీయ ఆటగాళ్లు) కాగా, 355 మంది అన్క్యాప్డ్(అంతర్జాతీయ క్రికెట్ ఆడని) ఆటగాళ్లు ఉన్నారు. మరో ఏడుగురు ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈసారి వేలం బరిలో కొత్త 44మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ఏడుగురిలో డేవిడ్ వైస్, జెజె స్మిట్, రూబెన్ ట్రంపెల్మన్, సందీప్ లమిచ్ఛనే, బ్రాడ్ వీల్, సఫయాన్ షరీఫ్, అలీ ఖాన్ ఉన్నారు. ఇక విదేశీ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, బౌల్ట్, కమ్మిన్స్, డికాక్, రబడా, డుప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈసారి వేలం బరిలో నిలవడంతో వీరిని దక్కించుకొనేందుకు 10 ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశముంది. భారత్‌నుంచి శ్రేయస్, ఇషన్ కిషన్, అశ్విన్, శిఖర్ ధావన్, రహానే, రైనా, చాహల్, సుందర్, శార్దూల్, దీపక్ చాహర్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ కూడా వేలంలో పాల్గొంటున్నారు. భారత సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా(39), శ్రీశాంత్ రూ.50 లక్షల కనీస బేస్ ప్రైస్‌లో వేలం బరిలో ఉన్నారు. అండర్-19 దక్షిణాఫ్రికా 18ఏళ్ల యువ క్రికెటర్ డేవాల్డ్ బ్రెవిస్ కూడా తుది జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. పది ఐపీఎల్ జట్లు ఈ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. రిజర్వ్ ప్రైస్ రెండు కోట్ల రేంజ్లో 48 మంది ఆటగాళ్లు ఉండగా.. 1.5 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌లో 20 మంది, కోటి ప్రైస్‌లో మరో 34 మంది ఉన్నారు. మొత్తం 370మంది భారత ఆటగాళ్లు, 220మంది విదేశీ ఆటగాళ్లు ఈసారి వేలం బరిలో నిలవడం విశేషం.