Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీ ట్రోఫీ వేదికల నుంచి తొలగింపు
హైదరాబాద్ : అంతర్గత కుమ్మలాటలు, మైదాన నిర్వహణలో అసలత్వం ఫలితంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దేశవాళీ క్రికెట్ ఆతిథ్య వేదికగా సైతం నిలువలేకపోతుంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీ లీగ్ దశ మ్యాచులను తొమ్మిది నగరాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక రూపొందింది. ఆ జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. కరెంట్ నిలిపివేతతో పిచ్‌పై నీళ్లు పట్టక పెద్ద పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే. రంజీ ట్రోఫీ లీగ్ దశ మ్యాచులు ఫిబ్రవరి 10 నుంచి ఆరంభం కానున్నాయి. ఫిబ్రవరి 10- మార్చి 15 వరకు లీగ్ మ్యాచులు జరుగుతాయి. ఎలైట్ గ్రూప్‌లో ఎనిమిది గ్రూపులు, ప్లేట్ దశలో ఓ గ్రూప్ ఉండనున్నాయి. ఎలైట్ గ్రూపులో నాలుగేసి జట్లు ఉండగా.. ప్లేట్ దశలో ఆరు జట్లు ఉంటాయి. ప్లేట్ గ్రూప్‌లో ఆరు జట్లు ఉన్నప్పటికీ ప్రతి జట్టు మరో మూడు జట్లతో మాత్రమే ఆడనుంది. ఎలైట్ గ్రూప్‌లో టాప్-7 జట్టు క్వార్టర్స్‌కు చేరనుండగా.. ఎలైట్ గ్రూప్‌లో 8వ జట్టు, ప్లేట్ గ్రూప్ టాపర్‌తో ప్రీ క్వార్టర్స్ ఆడాల్సి ఉంటుంది. రాజ్‌కోట్, కటక్, చెన్నై, అహ్మదాబాద్, త్రివేండ్రం, ఢిల్లీ, హర్యానా, గువహటిలు వేదికలుగా రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచులు నిర్వహించనున్నారు.