Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో ఆసీస్‌పై ఘన విజయం
- అండర్-19 ప్రపంచకప్
కూలిడ్జ్ : యువ భారత్ అదరగొట్టింది. జూనియర్ క్రికెట్లో ఆధిపత్యం నిలుపుకుంటూ వరుసగా నాల్గో సారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. కెప్టెన్ యశ్ ధుల్ (110, 110 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), వైస్ కెప్టెన్, తెలుగు తేజం షేక్ రషీద్ (94, 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ప్రదర్శనలతో చెలరేగటంతో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యశ్ ధుల్, షేక్ రషీద్ సూపర్ బ్యాటింగ్ ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ 290/5 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలోనే చేతులెత్తేసింది. లచ్లాన్ షా (51) ఒక్కడే ఆసీస్ తరఫున మెరిశాడు. బౌలర్లు నిశాంత్ సింధు (2/25), రవి కుమార్ (2/37)లు ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 194 పరుగులకే కుప్పకూలింది. మరో సెమీఫైనల్లో అఫ్గనిస్థాన్‌పై ఇంగ్లాండ్ గెలుపొందింది. 24 ఏండ్ల తర్వాత ఇంగ్లాండ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో టైటిల్ కోసం భారత్‌తో ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోనుంది.