Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ షురూ
- ఆరంభ వేడుకల్లో త్రివర్ణ పతాక రెపరెపలు
బీజింగ్ : కరోనా మహమ్మారితో వ్యవస్థలు కకావికలం. వరుస లాక్డౌన్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం. మహమ్మారి గడ్డు కాలంలో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి విశ్వ క్రీడలకు చైనా సగర్వంగా ఆతిథ్యం ఇస్తోంది. సమ్మర్, వింటర్ ఒలింపిక్స్లకు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక నగరంగా బీజింగ్ చరిత్ర సృష్టించగా.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను అధికారికంగా ఆరంభించారు. ఆరంభ వేడుకులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. బీజింగ్ బర్డ్స్ నెస్ట్ స్టేడియంలో కన్నుల పండుగగా జరిగిన కలర్‌ఫుల్ ఈవెంట్లో భారత అథ్లెట్ ఆరిఫ్ కాన్ ఆరంభ వేడుకల పరేడ్‌లో భారత జాతీయ పతాకధారిగా నిలిచాడు. ఓ వింటర్ ఒలింపిక్స్‌లో రెండు విభాగాల్లో పోటీపడేందుకు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచిన ఆరీఫ్ ఫిబ్రవరి 13, 16న పతకం కోసం పోటీపడనున్నాడు. 91 దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడుతున్న బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 20న ముగియనున్నాయి.