Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డు అధ్యక్షుడిగా నా పని చేస్తాను
- విమర్శకులకు సౌరవ్ గంగూలీ కౌంటర్
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు, విమర్శలపై దాదా స్పందించాడు. ఊహాగానాలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదని విమర్శకులకు గట్టిగా పంచ్ ఇచ్చాడు. 'ఊహాగానాలు, ఆధారం లేని విమర్శకులకు స్పందించాలని అనుకోవటం లేదు. నేను బీసీసీఐ అధ్యక్షుడిని. బోర్డు ప్రెసిడెంట్‌గా నా పని ఏంటో నేను చేస్తాను. సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. జై షా, జయేశ్ జార్జ్‌లు సైతం ఫోటోలో ఉన్నారు. అది సెలక్షన్ కమిటీ సమావేశం కాదు. జయేశ్ జార్జ్ సైతం సెలక్షన్ కమిటీలో భాగం కాదని' గంగూలీ అన్నాడు. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్టు గంగూలీ వెల్లడించాడు. 'పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్ కోసం బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2023 మహిళల ఐపీఎల్‌కు సరైన సమయమని నేను బలంగా నమ్ముతున్నాను. మెన్స్ ఐపీఎల్ తరహాలో పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్ సైతం విజయవంతం కావాలని ప్లాన్ చేస్తున్నామని' గంగూలీ చెప్పాడు.
అభిమానులకు నో ఎంట్రీ! : ' ఈడెన్ గార్డెన్స్‌లో అభిమానులను అనుమతించటం లేదు. టీ20 సిరీస్‌కు క్యాబ్ అధికారులు టికెట్లను సైతం అమ్మటం లేదు. మ్యాచ్ అధికారులు, మైదాన సిబ్బంది, ఇతర విభాగాలు వారు మాత్రమే స్టేడియంలో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినా ఆటగాళ్ల ఆరోగ్య భద్రతపై రాజీ పడలేమని' గంగూలీ పేర్కొన్నాడు.