Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యం 190 పరుగులు
- రాజ్‌కు ఐదు, రవికి నాలుగు వికెట్లు
- అండర్-19 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్
ఆంటిగ్వా: ఐసిసి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఐదో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. శనివారం రాత్రి ఫైనల్లో రాజ్ బవ(5/31), రవికుమార్(4/34) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ జట్టు 189 పరుగులకే కుప్పకూలింది. జేమ్స్ రా(95), జేమ్స్ సెలెస్(34నాటౌట్) రాణించారు. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. బెథెల్(2), కెప్టెన్ టామ్(0) నిరాశపర్చడంతో ఆ జట్టు 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. విలియమ్(4), జార్జి(0), రేహన్(10), అలెక్స్(10) కూడా నిరాశపర్చడంతో ఆ జట్టు 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో జేమ్స్-సెలెస్ కలిసి 8వ వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. జట్టు స్కోర్ 184 పరుగుల వద్ద జేమ్స్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌వద్ద కౌశల్ అద్భుత క్యాచ్ పట్టడంతో అతడు తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత మరో 5 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ జట్టు చివరి 2 వికెట్లను కోల్పోయింది. కౌశల్‌కు ఒక వికెట్ దక్కింది.