Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్-19 క్రికెటర్లపై బీసీసీఐ ఆలోచన
ముంబయి : కమల్ పాసి.. పంజాబ్‌కు కొన్ని సీజన్ల ముంగిట కొన్ని మ్యాచుల్లో కనిపించాడు. రవికాంత్ సింగ్ నాలుగేండ్ల అనంతరం ఇప్పుడిప్పుడే వ్యవస్థలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మన్జోత్ కర్లా కెరీర్ ఇప్పటికీ ఊపందుకోలేదు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుపు ప్రదర్శనలు చేసి ప్రశంసలు అందుకున్న కొందరు యువ క్రికెటర్ల ప్రస్తుత పరిస్థితి ఇది. వీళ్లంతూ ఒకప్పటి అండర్-19 ప్రపంచకప్ హీరోలు. కానీ రాష్ట్ర క్రికెట్ జట్టు సీనియర్ విభాగంలో పోటీపడాల్సిన తరుణంలో ఎక్కువ మంది తడబడుతున్నారు. షేక్ రషీద్, యశ్ ధుల్, రవికుమార్,రాజ్ బవా వంటి కుర్రాళ్లు రానున్న రంజీ సీజన్లో రాష్ట్ర సీనియర్ జట్టుకు ఎంపిక కావచ్చు. కానీ భారత అండర్-19 జట్టులోని మిగతా క్రికెటర్ల పరిస్థితి ఏమిటీ? ఈ ప్రశ్నే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సరికొత్త ప్రణాళికలతో ముందుకొచ్చేలా చేస్తుంది. దేశవాళీ క్రికెట్లో అండర్-23 స్థానంలో ఇప్పుడు అండర్-25 జట్టు ఆడుతోంది. జాతీయ క్రికెట్లో భారత్-ఏ నడుస్తోంది. అండర్-19 క్రికెటర్లు ఇటు అండర్-25లోనూ, అటు భారత్-ఏలో చోటు దక్కించుకోవటంలో విఫలమవుతున్నారు. అండర్-19 ప్రపంచకప్ అనంతరం ఈ కుర్రాళ్లపై బోర్డు ఫోకస్ ఆగిపోతుంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సిద్ధపడుతున్నారు.
' ఐదెంచల వ్యవస్థతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఆటగాళ్లను అందించేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ ప్రణాళిక రూపొందిస్తోంది. అండర్-16, అండర్-19, ఎమర్జింగ్ నేషనల్ అండర్-23 సహా భారత్-ఏ జట్టులో ఈ ప్లాన్‌లో భాగం. ఈ ప్రణాళికలో అండర్-19 ప్లస్ విభాగాన్ని జోడించనున్నారు. దీంతో కుర్రాళ్లను భారత క్రికెట్ ప్రణాళికల్లో ప్రధానంగా నిలుపనున్నారు. నూతన జాతీయ క్రికెట్ అకాడమీ ప్రాంగణంలో నాలుగు ఫస్ట్ క్లాస్ క్రికెట్ గ్రౌండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర క్రికెట్ జట్లకు ఎంపిక కాలేని అండర్-19 కుర్రాళ్లను ఎన్సీఏ స్వయంగా అకాడమీలోకి తీసుకుని శిక్షణ ఇవ్వనుంది. ఎన్సీఏ పేస్ బౌలింగ్ కోచ్ ఆస్ట్రేలియాకు చెందిన ట్రారు కూలీ ఇప్పటికే చేరాడు. పూర్తి బోర్డు ఖర్చులతో సుమారు 10 మంది యువ పేసర్లను ఎన్సీఏ తయారు చేసేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఈ మేరకు బోర్డు బాస్‌లు గంగూలీ, జై షాలతో వీవీఎస్ లక్ష్మణ్ పలుమార్లు చర్చలు జరిపాడు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.