Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు మోహన్ భగన్తో పోరు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళుతున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ)..ఏటీకే మోహన్ బగాన్‌తో మంగళవారం తలపడనుంది. హ్యట్రిక్ విజయాలతో తమకు ఎదురే లేదన్నట్లుగా దూసుకెళుతున్న హెచ్ఎఫ్సీ టాప్-4లో స్థిరమైన చోటే లక్ష్యంగా ఎంచుకుంది. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 26 పాయింట్లతో ప్రస్తుతం టాప్‌లో ఉన్న హెచ్ఎఫ్సీ మరో విజయంపై కన్నేసింది. మరోవైపు 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 20 పాయింట్లతో మోహన్‌బగాన్ ఆరో స్ధానంలో ఉంది. లీగ్‌లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించనుంది. హైదరాబాద్ తరఫున స్టార్ ప్లేయర్ ఓగ్బాచె సూపర్ ఫామ్మీదున్నాడు. ఓగ్బాచెకు తోడు ఆకాశ్మిశ్రా, సివెరియో, విక్టర్ లాంటి ప్లేయర్లు చెలరేగితే హెచ్‌ఎఫ్‌సీకి తిరుగుండకపోవచ్చు. నిలకడలేమితో సతమతమవుతున్న ఏటీకే..గెలిచి టాప్-4లో చోటు దక్కించుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హౌరాహౌరీ పోరు జరుగవచ్చు.
రసవత్తర పోరుకు ఆస్కారం: మనాలో హెచ్ఎఫ్సీ, ఏటీకే మోహన్బగాన్తో మ్యాచ్ సందర్భంగా సోమవారం హెచ్ఎఫ్సీ కోచ్ మనాలో మార్వ్కెజ్ మాట్లాడుతూ లీగ్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటైన మోహన్బగాన్తో ఢ అంటే ఢ అన్నట్లు జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బలం, బలహీనతలు ఏంటో ఒకరికొకరు తెలుసు. లీగ్‌లో టైటిల్ దక్కించుకునే అవకాశమున్న రెండు జట్ల మధ్య పోరు ఆసక్తి కల్గిస్తుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే క్రమంలో మ్యాచ్ ఆఖరి వరకు రంజుగా సాగనుంది. గతంలో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఎలాగైనా టాప్-4లో స్తిరమైన చోటు కోసం మేము ప్రయత్నిస్తున్నాం. చివరికి విజయం ఎవరి వరిస్తుందో చూడాలి.
ఓగ్బాచె సూపర్ ఫామ్:
స్టార్ ప్లేయర్ ఓగ్బాచె సూపర్ ఫామ్మీదున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఓగ్గాచె..ఐదు గోల్స్‌తో ఓగ్బాచె జోరు మీదున్నాడు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ లీగ్‌లో 22 గోల్స్‌తో దూసుకెళుతున్నాడు. ఓగ్బాచెకు తోడు జోయల్ చియానిస్, సివెరియో, నిఖిల్ పుజారి, అనికేత్ జాదవ్, ఎడు గార్సియా జత కలిస్తే హెచ్ఎఫ్సీ ఖాతాలో మరో విజయం చేరినట్లే. లీగ్‌లో ఇప్పటి వరకు 33 గోల్స్‌తో హెచ్ఎఫ్సీ టాప్ గేర్‌లో దూసుకెళుతున్నది. ఇదే దూకుడు కొనసాగిస్తే..హెచ్ఎఫ్సీ సెమీస్ బెర్తుకు మరింత చేరువైనట్లే. మరోవైపు ఏటీకే జట్టులో కొలాకో, మన్వీర్సింగ్, డేవిడ్ విలియమ్స్, బౌమాస్, కార్ల్ మెకహేౌ చెలరేగితే హౌరాహౌరీ పోరు తప్పకపోవచ్చు.