Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్కోట్ : ఫామ్ కోల్పోయి, జాతీయ జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకున్న టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. పరుగుల వేటలో తనేంటో నిరూపించుకునేందుకు సౌరాష్ట్ర రంజీ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం సెలక్టర్లు 21 మందితో కూడిన జట్టును ఎంపిక చేయగా అందులో పుజారా సైతం ఉన్నాడు. సీనియర్ పేసర్ జైదేవ్ ఉనద్కత్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ సంచలనం పేసర్ చేతన్ సకారియ సైతం జట్టులో నిలిచాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో 41 సార్లు చాంపియన్ ముంబయి, ఒడిశా, గోవాలతో సౌరాష్ట్ర గ్రూప్ దశ మ్యాచులు అహ్మదాబాద్లో ఆడనుంది.