Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ వేలంలో దక్కని అవకాశం
ముంబయి : అండర్-19 ప్రపంచకప్ హీరోలకు చేదువార్త. రికార్డు స్థాయిలో భారత్‌కు ఐదో అండర్-19 ప్రపంచకప్ తీసుకొచ్చిన యువ క్రికెటర్లు రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా ఆటగాళ్ల వేలానికి దూరం కానున్నారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలం నిబంధనల ప్రకారం కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అనుభవం ఉంటేనే ఆటగాళ్ల వేలానికి అర్హులు. గత రెండేండ్లలో కరోనా మహమ్మారితో దేశవాళీ క్రికెట్ నిలిచిపోయింది. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్ మ్యాచులు నిర్వహించినా.. సీనియర్ క్రికెట్‌తో సమాంతరంగా జూనియర్ క్రికెట్ నిర్వహించారు. కొందరు ఆటగాళ్లను సీనియర్ జట్టులోకి ఎంపిక చేసినా.. భారత జట్టు అండర్-19 ప్రణాళికల్లో భాగంగా ఉండటంతో రాష్ట్ర క్రికెట్ జట్టులోకి పంపించలేదు. అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన షేక్ రషీద్, రవి కుమార్, దినేశ్ బనా, నిశాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, రఘువంశి, మానవ్ ప్రకాశ్ సహా సంగ్వాన్‌లు ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలానికి దూరంగా ఉన్నారు. కరోనా పరిస్థితులను గమనంలో ఉంచుకుని, అండర్-19 కుర్రాళ్లను ప్రత్యేకంగా పరిగణించి వేలానికి అనుమతించాలని బీసీసీఐ మాజీ అడ్మినిస్ట్రేటర్ రత్నాకర్ శెట్టి కోరారు. ఫిబ్రవరి 12, 13న బెంగళూర్‌లో ఐపీఎల్ వేలం ఉండటంతో నిర్ణయం తీసుకునేందుకు బోర్డుకు స్వల్ప సమయమే ఉంది. గంగూలీ, షా కుర్రాళ్లకు అవకాశం ఇస్తారా? లేదా? చూడాలి.