Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహ్మదాబాద్ ప్రాంఛైజీ పేరు ఖరారు
అహ్మదాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త ప్రాంఛైజీ అహ్మదాబాద్ తన జట్టు పేరును బుధవారం ఖరారు చేసింది. ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలానికి ముందు అహ్మదాబాద్ ప్రాంచైజీ యజమాని సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా పేరును ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికగా నడువనున్న కొత్త ప్రాంఛైజీ 'గుజరాత్ టైటాన్స్' పేరుతో ఐపీఎల్ బరిలోకి దిగుతోంది. కొత్త ప్రాంఛైజీ పేరుపై సోషల్ మీడియాలు పలు పేర్లు చక్కర్లు కొట్టినా.. గుజరాత్ టైటాన్స్‌తో ప్రాంఛైజీ యాజమాన్యం అభిమానులను థ్రిల్ చేసింది. హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్లను వేలానికి ముందు ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. ఫిబ్రవరి 12, 13న వేలంలో ధనాధన్ జట్టు కోసం ప్రయత్నించనుంది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు పనిచేసిన సహాయక సిబ్బంది ఆశీష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్, విక్రమ్ సోలంకిలు గుజరాత్ టైటాన్స్ కోచింగ్ సిబ్బందిగా పనిచేయనున్నారు.