Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-0తో వన్డే సిరీస్ భారత్ వశం ొరాణించిన అయ్యర్, సిరాజ్
నవతెలంగాణ-అహ్మదాబాద్
టీమ్ ఇండియా స్వీప్ చేసింది. వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. పేసర్లు ప్రసిద్ కృష్ణ (3/27), మహ్మద్ సిరాజ్ (3/29) చెలరేగటంతో మూడో వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత పేసర్ల విజృంభణతో 267 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూలింది. తొలుత, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' శ్రేయస్ అయ్యర్ (80, 111 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (56, 54 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) అర్థ సెంచరీలతో రాణించటంతో భారత్ తొలుత 265 పరుగులు చేసింది.
రాణించిన అయ్యర్, పంత్ : తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ టాప్ ఆర్డర్ వైఫల్యంతో ఆరంభంలో తడబడింది. విండీస్ పేసర్ అల్జారీ జొసెఫ్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లి (0)లను అవుట్ చేశాడు. శిఖర్ ధావన్ (10) సైతం విఫలమవటంతో భారత్ 42/3తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ (80), రిషబ్ పంత్ (56)లు నాల్గో వికెట్‌కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అర్థ సెంచరీ అనంతరం పంత్ నిష్క్రమించినా.. టెయిలెండర్ల అండతో అయ్యర్ భారత్‌కు మెరుగైన స్కోరు అందించాడు. లోయర్ ఆర్డర్లో దీపక్ చాహర్ (38, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (33, 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షోతో అలరించారు. చాహర్, సుందర్ మెరుపులతో భారత్ సిరీస్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
భారత పేసర్లు మరోసారి ఆకట్టుకున్నారు. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ విలవిల్లాడింది. హౌప్ (5), కింగ్ (14), బ్రావో (19), బ్రూక్స్ (0), హౌల్డర్ (6), అలెన్ (0)లు స్వల్ప స్కోరుకే వికెట్ కోల్పోయారు. పూరన్ (34), జొసెఫ్ (29), స్మిత్ (36) పోరాడినా ఫలితం లేకపోయింది. వరుసగా మూడో వన్డేలోనూ వెస్టిండీస్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : 265/10 (అయ్యర్ 80, పంత్ 56, చాహర్ 38, జేసన్ 4/34, జొసెఫ్ 2/54)
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 169/10 ( స్మిత్ 36, పూరన్ 34, జొసెఫ్ 34, సిరాజ్ 3/29, ప్రసిద్ 3/27)