Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లివింగ్‌స్టోన్‌కు రూ.11.5 కోట్లు
- జోఫ్రా ఆర్చర్‌కు రూ.8 కోట్లు
- టిమ్ డెవిడ్కు రూ.8.25 కోట్లు
- రొమారియో షెఫర్డ్‌కు రూ.7.75 కోట్లు
- ముగిసిన ఐపీఎల్ 15 మెగా వేలం
ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలం కాసుల వర్షం (551.7 కోట్లు) కురిపించింది. రెండో రోజు వేలంలో విదేశీ ఆల్రౌండర్లపై ప్రాంఛైజీలు కోట్లు కురిపించాయి. ఇంగ్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ లియాం లివింగ్‌స్టోన్ రూ.11.25 కోట్లు, భీకర పేసర్ జోఫ్రా ఆర్చర్ రూ.8 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నారు. సింగపూర్ కుర్రాడు టిమ్ డెవిడ్ రూ.8.25 కోట్లతో సంచలనం సృష్టించాడు. విండీస్ కుర్రాడు రోమారియో షెఫర్డ్ కోసం సన్‌రైజర్స్ రూ.7.75 కోట్ల రికార్డు బిడ్ వేసి ఔరా అనిపించింది.
నవతెలంగాణ-బెంగళూర్
జోఫ్రా ఆర్చర్. గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేసుకున్న ఇంగ్లాండ్ పేసర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఆడటం అనుమానం. అయినా, అతడి కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్‌లు ఆర్చర్ కోసం పోటీపడగా.. ఆ రేసులోకి సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం చేరింది. ఆర్చర్ కోసం వేచిచూస్తున్న ముంబయి ఇండియన్స్ అతడిని రూ.8 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. లియాం లివింగ్‌స్టోన్ రూ.11.5 కోట్లతో పంజాబ్ కింగ్స్ గూటికి చేరాడు. స్పిన్ ఆల్‌రౌండర్ కోసం చెన్నై, కోల్‌కత, గుజరాత్, హైదరాబాద్ పోటీపడినా పంజాబ్ భారీ ధరతో ఎత్తుకెళ్లింది. అనామక సింగపూర్ క్రికెటర్ టిమ్ డెవిడ్ కోసం ముంబయి ఏకంగా రూ.8.25 కోట్లు వెచ్చించింది. కోల్‌కత నైట్‌రైడర్స్ సైతం చివరి వరకు ప్రయత్నించినా.. డెవిడ్‌ను ముంబయి సొంతం చేసుకుంది. హైదరాబాదీ క్రికెటర్లు తిలక్ వర్మ, రాహుల్ బుద్దిలు ముంబయి ఇండియన్స్‌కు సొంతమవగా.. పేసర్ సి.వి మిలింద్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఎంచుకుంది. రెండు రోజుల ఐపీఎల్ మెగా వేలంలో 204 మంది క్రికెటర్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అందులో 137 మంది భారత, 67 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.
రైనాకు షాక్ : ఐపీఎల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ముందుండే సురేశ్ రైనాకు బిగ్ షాక్. చెన్నై తరఫున కీలక ఆటగాడిగా కొనసాగిన రైనా.. గుజరాత్ లయన్స్‌కు రెండేండ్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సురేశ్ రైనా కోసం ప్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. చెన్నై సూపర్‌కింగ్స్ వద్ద రైనాను తీసుకునేందుకు తగినంత డబ్బు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్న తాలాను వదిలేసింది. చెన్నై రూ.2.95 కోట్ల మిగులు బడ్జెట్‌తో వేలం ముగించటం గమనార్హం.
తొలి రౌండ్ వేలంలో అమ్ముడుపోని కీలక ఆటగాళ్లు రెండో రౌండ్లో ఊరట పొందారు. డెవిడ్ మిల్లర్, వృద్దిమాన్ సాహా, మాథ్యూ వేడ్లను గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. క్రిస్ జోర్డాన్ రూ.3.6 కోట్లకు చెన్నైకి, శామ్ బిల్లింగ్స్ రూ.2 కోట్లకు కోల్‌కతకు వెళ్లారు. మార్కరంను సన్‌రైజర్స్ తీసుకోగా.. అజింక్య రహానెను కోల్‌కత కొనుక్కుంది. సఫారీ యువ పేసర్ మార్కో జెన్సెన్ కోసం సన్‌రైజర్స్ రూ.4.2 కోట్లు ఖర్చు చేసింది. విండీస్ కుర్రాడు రొమారియో షెఫర్డ్ కోసం పట్టుదలగా వెళ్లిన సన్‌రైజర్స్ రూ.7.75 కోట్ల బిడ్‌ను ముంబయిని వెనక్కి నెట్టి తీసుకుంది. విండీస్ నయా స్టార్ ఒడీన్ స్మిత్ రూ.6 కోట్లకు పంజాబ్‌కు వెళ్లాడు. జానీ బెయిర్‌స్టో సైతం రూ.6.75 కోట్లకు పంజాబ్ సొంతమయ్యాడు.
చెన్నై సూపర్‌కింగ్స్
భారత్ : 17, విదేశీ : 8 , మొత్తం :25
బ్యాటర్లు : రుతురాజ్ (6), కాన్వే (1), సేనాపతి (0.20), హరి (0.20), ఉతప్ప (2).
వికెట్ కీపర్లు : ఎం.ఎస్ ధోని (12), జగదీశన్ (0.20), రాయుడు (6.75).
ఆల్‌రౌండర్లు : జడేజా (16), మోయిన్ (8), దూబె (4), జోర్డాన్ (3.6), భగత్ (0.20), శాంట్నర్ (1.9), బ్రావో (4.4), ప్రిటోరిస్ (0.50).
బౌలర్లు : మహీశ్ (0.70), రాజ్వర్ధన్ (1.5), సిమ్రన్ సింగ్ (0.20), మిల్నె (1.9), ముకేశ్ (0.20), సోలంకి (1.2), తుషార్ (0.20), అసిఫ్ (0.20), దీపక్ (14).
సన్‌రైజర్స్ హైదరాబాద్
భారత్ : 15, విదేశీ : 8, మొత్తం : 23
బ్యాటర్లు : విలియమ్సన్ (14), మార్కరం (2.6), శశాంక్ (0.20), రవికుమార్ (0.20), రాహుల్ త్రిపాఠి (8.,50), గార్గ్ (0.20).
వికెట్ కీపర్లు : గ్లెన్ ఫిలిప్స్ (1.5), విష్ణు (0.50), నికోలస్ పూరన్ (10.75).
ఆల్‌రౌండర్లు : సమద్ (4), జెన్సెన్ (4.2), సీన్ అబాట్ (2.4), అభిషేక్ (6.5), వాషింగ్టన్ (8.75).
బౌలర్లు : ఉమ్రాన్ (4), సౌరబ్ (0.20), రోమారియో షెఫర్డ్ (7.75), ఫరూకీ (0.50), సుచిత్ (0.20), గోపాల్ (0.75), కార్తీక్ త్యాగి (4), నటరాజన్ (4), భువనేశ్వర్ (4.2).
లక్నో సూపర్‌జెయింట్స్
భారత్ : 14, విదేశీ : 7, మొత్తం : 21
బ్యాటర్లు : మనన్ వోహ్రా (0.20), ఎవిన్ లూయిస్ (2), మనీశ్ పాండే (4.6).
వికెట్ కీపర్లు : కెఎల్ రాహుల్ (17), డికాక్ (6.75).
ఆల్‌రౌండర్లు : స్టోయినిస్ (9.2), మేయర్స్ (0.50), కరణ్ శర్మ (0.20), కృష్ణప్ప గౌతమ్(0.90), ఆయుశ్ (0.20), దీపక్ హుడా (5.75), కృనాల్ పాండ్య (8.25), జేసన్ హోల్డర్ (8.75).
బౌలర్లు : బిష్ణోరు (4), చమీరా (2), నదీమ్ (0.50), మోసిన్ ఖాన్ (.20), మయాంక్ యాదవ్ (0.20), అంకిత్ రాజ్‌పుత్ (0.50), అవేశ్ ఖాన్ (10), మార్క్‌వుడ్ (7.50).
ఢిల్లీ క్యాపిటల్స్
భారత్ 17, విదేశీ : 7, మొత్తం : 24
బ్యాటర్లు : పృథ్వీ షా (7.5), మన్దీప్ సింగ్ (1.1), యశ్ ధుల్ (0.50), రోవ్‌మన్ పావెల్ (2.8), సర్ఫరాజ్ (0.20), అశ్విన్ హెబ్బర్ (0.20), డెవిడ్ వార్నర్ (6.25).
వికెట్ కీపర్లు : రిషబ్ పంత్ (16), టిమ్ సీఫర్ట్ (0.50), కె.ఎస్ భరత్ (2).
ఆల్‌రౌండర్లు : అక్షర్ పటేల్ (9), లలిత్ యాదవ్ (0.65), విక్కీ (0.20), రిపాల్ పటేల్(0.20), మిచెల్ మార్ష్ (6.5).
బౌలర్లు : ఎన్రిచ్ నోకియా (6.5), ఖలీల్ అహ్మద్ (5.25), లుంగి ఎంగిడి (0.50), సకారియ (4.2), ప్రవీణ్ దూబె (0.50), నాగర్కోటి (1.1), కుల్దీప్ (2), శార్దుల్ (10.75), ముస్తాఫిజుర్ (2).
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్
: భారత్ : 14, విదేశీ : 8, మొత్తం : 22
బ్యాటర్లు : విరాట్ కోహ్లి (15), ప్రభుదేశారు (0.30), డుప్లెసిస్ (7).
వికెట్ కీపర్లు : ఫిన్ అలెన్ (0.80), సిసోడియ (0.20), అనుజ్ రావత్ (3.4), దినేశ్ కార్తీక్ (5.5).
ఆల్‌రౌండర్లు : మాక్స్వెల్ (11), డెవిడ్ విల్లే (2), మహిపాల్ (0.95), రూథర్‌ఫోర్డ్ (1), అన్నీశ్వర్ (0.20), షాబాజ్ (2.4), హసరంగ (10.75).
బౌలర్లు : సిరాజ్ (7), కరణ్ శర్మ (0.50), బెహ్రాన్‌డార్ఫ్ (0.75), సిద్దార్థ్ కౌల్ (0.75), సి.వి మిలింద్ (0.25), హజిల్‌వుడ్ (7.75), హర్షల్ పటేల్ (10.75), ఆకాశ్ దీప్ (0.20).
పంజాబ్ కింగ్స్
భారత్ : 18, విదేశీ : 7,
మొత్తం : 25
బ్యాటర్లు : మయాంక్ (12), మన్కడ్ (0.20), రాజపక్సె (0.50), షారుక్ (9), శిఖర్ ధావన్ (8.25).
వికెట్ కీపర్లు : ప్రభుసిమ్రన్ (0.60), జితేశ్ (0.20), బెయిర్‌స్టో (6.75).
ఆల్‌రౌండర్లు : బెన్నీ హోవెల్ (0.40), బల్తేజ్ సింగ్ (0.20), లివింగ్‌స్టోన్ (11.50), రిషి ధావన్ (0.55), అతర్వ (0.20).
బౌలర్లు : అర్షదీప్ (4), చటర్జీ (0.20), ఒడీన్ స్మిత్ (6), సందీప్ శర్మ (0.50), రాజ్ బవ (2), నాథన్ ఎలిస్ (0.75), వైభవ్ అరోర (2), ఇషాన్ పోరెల్ (0.25), హర్‌ప్రీత్ బరార్ (3.8), రాహుల్ చాహర్ (5.25), కగిసో రబాడ (9.25).
గుజరాత్ టైటాన్స్
భారత్ : 15, విదేశీ : 8, మొత్తం : '23
బ్యాటర్లు : శుభ్‌మన్ (8), సుదర్శన్ (0.20), అభినవ్ (2.5), జేసన్ రారు (2), మిల్లర్ (3).
వికెట్ కీపర్లు : మాథ్యూ వేడ్ (2.4), వృద్దిమాన్ సాహా (1.9).
ఆల్‌రౌండర్లు : హార్దిక్ పాండ్య (15), డొమినిక్ (1.1), విజరు శంకర్ (1.4), జయంత్ (1.7), గుర్కీరత్ (0.50), తెవాటియ (9).
బౌలర్లు : రషీద్ ఖాన్ (15), వరుణ్ అరోన్ (0.50), దర్శన్ (0.20), యశ్ దయాల్ (3.2), ప్రదీప్ సంగ్వాన్ (0.20), అల్జారీ జొసెఫ్ (2.4), సాయికిశోర్ (3), నూర్ అహ్మద్ (0.30), ఫెర్గుసన్ (10), మహ్మద్ షమి (6.25).
రాజస్థాన్ రాయల్స్
భారత్ : 16, విదేశీ : 8,
మొత్తం : 24
బ్యాటర్లు : యశస్వి జైస్వాల్ (4), కరుణ్ నాయర్ (1.4), డుసెన్ (1), దేవ్‌దత్ పడిక్కల్ (7.75), హెట్మయర్ (8.50).
వికెట్కీపర్లు : సంజు శాంసన్ (14), జోశ్ బట్లర్ (10), ధ్రువ్ జురెల్ (0.20).
ఆల్‌రౌండర్లు : అనునరు సింగ్ (0.20), నీషమ్ (1.5), డార్లీ మిచెల్ (0.75), రియాన్ పరాగ్ (3.8), అశ్విన్ (5).
బౌలర్లు : కుల్దీప్ (0.20), శుభం (0.20), కౌల్టర్‌నైల్ (2), నవదీప్ 92.6), కుల్దీప్ సేన్ (0.20), మెక్కారు (0.75), తెజస్ బరోక (0.20), కరియప్ప (0.30), చాహల్ (6.50), ప్రసిద్ కృష్ణ (10), బౌల్ట్ (8).
కోల్‌కత నైట్‌రైడర్స్
భారత్ : 17, విదేశీ : 8,
మొత్తం : 25
బ్యాటర్లు : ఇంద్రజిత్ (0.20), ప్రతమ్ (0.20), రమేశ్ (0.20), రహానె (1.1), రింకూ (0.55), తోమర్ (0.40), అలెక్స్ హేల్స్ (1.5), శ్రేయస్ అయ్యర్ (12.25), ఆమన్ ఖాన్ (0.20).
వికెట్ కీపర్లు : షెల్డన్ జాక్సన్ (0.60), శామ్ బిల్లింగ్స్ (2).
ఆల్‌రౌండర్లు : రసెల్ (12), వెంకటేశ్ అయ్యర్ (8), నరైన్ (6), అనుకూల్ (0.20), నితీశ్ రానా (8), మహ్మద్ నబి (1).
బౌలర్లు : వరుణ్ చక్రవర్తి (8), కరుణరత్నె (0.50), అశోక్ శర్మ (0.55), సలాం (0.20), సౌథీ (1.5), శివం మావి (7.25), ఉమేశ్ యాదవ్ (2), పాట్ కమిన్స్ (7.25).
ముంబయి ఇండియన్స్
భారత్ : 17, విదేశీ : 8,
మొత్తం : 25
బ్యాటర్లు : రోహిత్ శర్మ (16), సూర్యకుమార్ (8), తిలక్ వర్మ (1.7), రమణ్‌దీప్ (0.20), రాహుల్ బుద్ది (0.20), అన్మోల్ప్రీత్ (0.20), డెవాల్డ్ బ్రెవిస్ (3).
వికెట్ కీపర్లు : ఆర్యన్ జుయల్ (0.20), ఇషాన్ కిషన్ (15.25).
ఆల్‌రౌండర్లు : కీరన్ పొలార్డ్ (6), హృతిక్ (0.20), అర్జున్ టెండూల్కర్ (0.30), సంజరు యాదవ్ (0.50), డానిల్ శామ్స్ (2.6), టిమ్ డెవిడ్ (8.25), ఫబిన్ అలెన్ (0.75).
బౌలర్లు : బుమ్రా (12), అర్షద్ ఖాన్ (0.20), జైదేవ్ (1.3), మార్కండె (0.65), జోఫ్రా ఆర్చర్ (8), మిల్స్ (1.5), మెరెడిత్ (1), మురుగన్ (1.6), బసిల్ తంపీ (0.30).