Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపు
క్వీన్స్టౌన్ : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ముంగిట టీమ్ ఇండియా వరుస పరాజయాలు చవిచూస్తోంది. అమేలి ఖెర్ (119 నాటౌట్, 135 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ శతకంతో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో ఛేదించింది. దీప్తి శర్మ (4/52) రాణించినా..అమేలి ఖెర్ (119), మాడీ గ్రీన్ (52, 61 బంతుల్లో 5 ఫోర్లు) కివీస్ విజయాన్ని ఖాయం చేవారు. సోఫి (33), మార్టిన్ (20) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత అమ్మాయిలు నిర్ణీత ఓవర్లలో 270/6 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (66 నాటౌట్, 81 బంతుల్లో 3 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (65, 64 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో మెరిశారు. తెలుగమ్మాయి, ఓపెనర్ మేఘన (49, 50 బంతుల్లో 7 ఫోర్లు) మెరుపు ప్రదర్శన చేసింది. షెఫాలీ వర్మ (24), యస్టికా భాటియా (31) ఫర్వాలేదనిపించినా..న్యూజిలాండ్‌ను నిలువరించే స్కోరును భారత్ సాధించలేదు. ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యం సాధించింది. అమేలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.