Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంఢగీఢ్తో హైదరాబాద్ ఢీ
కటక్ : రెండేండ్ల విరామం అనంతరం దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ నేటి నుంచి ఆరంభం కానుంది. తొమ్మిది గ్రూపులు (8 ఎలైట్, 1 ప్లేట్), తొమ్మిది వేదికల్లో గ్రూప్ దశ మ్యాచుల్లో తలపడనున్నాయి. భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు అజింక్య రహానె, చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నారు. సౌరాష్ట్ర, ముంబయి ముఖాముఖి పోరులో రహానె, పుజారా తొలి రోజే బరిలో నిలిచారు. తొలి దశ రంజీ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచులు, ఓ ప్రీ క్వార్టర్‌ఫైనల్ నిర్వహిస్తారు.
వైట్‌బాల్ క్రికెట్లో విశేషంగా ఆకట్టుకున్న హైదరాబాద్ రెడ్ బాల్లోనూ అదే జోరు చూపించేందుకు ఎదురుచూస్తోంది. స్టార్ హనుమ విహారి, యువ సంచలనం తిలక్ వర్మలపై హైదరాబాద్ ప్రధానంగా ఆధారపడింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చెలరేగిన సివి మిలింద్ రంజీ ట్రోఫీలోనూ తనదైన దూకుడు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. గ్రూప్-బిలో నేడు చంఢగీఢ్తో హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అండర్-19 స్టార్స్ రాజ్ బవ, హర్నూర్ సింగ్‌లు ఈ జట్టులో ఉన్నారు. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం అవనుంది.