Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్ : భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్లో టాప్-4లో కొనసాగు తున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్ నాల్గో స్థానంలో ఉండగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పదో స్థానం నిలుపుకున్నాడు. బౌలింగ్, ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఎవరూ టాప్-10లో చోటు సాధించలేదు. వన్డే బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు వరుసగా 2, 3వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పాక్ ఆటగాడు బాబర్ ఆజామ్ అగ్రస్థానం నిలుపుకున్నాడు.