Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టీ20లో భారత్ విజయం
- అరంగేట్రంలోనే బిష్ణోరు మాయ
- రాణించిన రోహిత్, సూర్యకుమార్
రవి బిష్ణోయ్ (2/17) మిస్టరీ మ్యాజిక్కు వెస్టిండీస్ విలవిల్లాడింది. మిడిల్ ఆర్డర్లో కీలక వికెట్లు కూల్చిన బిష్ణోరు.. చాహల్ తోడుగా కరీబియన్ల భరతం పట్టాడు. నికోలస్ పూరన్ (61) అర్థ సెంచరీతో చెలరేగినా ఆ జట్టు 157 పరుగులే పరిమితమైంది. ఛేదనలో రోహిత్ శర్మ (40), సూర్యకుమార్ యాదవ్ (34) రాణించటంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
నవతెలంగాణ-కోల్‌కత
టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. యువ స్పిన్నర్ రవి బిష్ణోరు (2/17) అరంగేట్రంలోనే మాయ చేయటంతో భారత్ 6 వికెట్ల తేడాతో తొలి టీ20లో గెలుపొందింది. సీనియర్ స్పిన్నర్ చాహల్ (2/37)తో కలిసి రవి బిష్ణోరు వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్‌ను చావుదెబ్బ కొట్టాడు. స్పిన్నర్ల జోరుతో వెస్టిండీస్ తొలుత 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (61, 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీకి తోడు ఓపెనర్ మేయర్స్ (31, 24 బంతుల్లో 7 ఫోర్లు),పొలార్డ్ (24 నాటౌట్, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో విండీస్ ఓ మోస్తరు స్కోరు చేసింది. ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (40, 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్, 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగటంతో 18.5 ఓవర్లలోనే భారత్ లాంఛనం ముగించింది. రవి బిష్ణోరు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. రెండో టీ20 శుక్రవారం జరుగనుంది.
అలవోకగా..! : 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (40) పవర్‌ప్లేలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో రోహిత్ దండెత్తాడు. ఇషాన్ కిషన్ (35)తో కలిసి తొలి వికెట్‌కు 64 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. పంత్ (8), విరాట్ (17) నిష్క్రమణతో విండీస్ ఆశలు చిగురించినా.. సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (24 నాటౌట్, 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షోతో లాంఛనం ముగించారు. ఈ జోడీ 4.2 ఓవర్లలోనే 48 పరుగులు పిండుకుంది. తొలి టీ20లో భారత్‌కు ఎదురులేని విజయాన్ని కట్టబెట్టింది.
మాయ చేశారు : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా మంచు ప్రభావం దృష్టిలో ఉంచుకుని టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే బ్రాండన్ కింగ్ (4) వికెట్‌తో బ్రేక్ అందించాడు. మరో ఓపెనర్ మేయర్స్ (31)తో కలిసి నికోలస్ పూరన్ (61) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్ విడదీయటంతో విండీస్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఓ వైపు పూరన్ నిలబడినా.. రోస్టన్ ఛేజ్ (4), పావెల్ (2), అకీల్ (10) మరోఎండ్‌లో విఫలమయ్యారు. కెప్టెన్ పొలార్డ్ (24 నాటౌట్) అండతో చివర్లో చెలరేగిన పూరన్ ధనాధన్ జోరు చూపించాడు. ఒడీన్ స్మిత్ (4 నాటౌట్) బౌండరీలు కొట్టలేకపోయాడు. స్పిన్నర్ల మెరుపులతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేసింది.
స్కోరు వివరాలు : వెస్టిండీస్ ఇన్నింగ్స్ : కింగ్ (సి) సూర్య (బి) భువనేశ్వర్ 4, మేయర్స్ (ఎల్బీ) చాహల్ 31, పూరన్ (సి) కోహ్లి (బి) పటేల్ 61, ఛేజ్ (ఎల్బీ) బిష్ణోరు 4, పావెల్ (సి) అయ్యర్ (బి) బిష్ణోరు 2, అకీల్ (సి,బి) చాహర్ 10, పొలార్డ్ నాటౌట్ 24, స్మిత్ (సి) శర్మ (బి) పటేల్ 4, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం :(20 ఓవర్లలో 7 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-4, 2-51, 3-72, 4-74, 5-90, 6-135, 7-157.
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-31-1, చాహర్ 3-0-28-1, హర్షల్ పటేల్ 4-0-37-2, చాహల్ 4-0-34-1, బిష్ణోరు 4-0-17-2, వెంకటేశ్ 1-0-4-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (సి) స్మిత్ (బి) ఛేజ్ 40, కిషన్ (సి) అలెన్ (బి) ఛేజ్ 35, కోహ్లి (సి) పొలార్డ్ (బి) అలెన్ 17, పంత్ (సి) స్మిత్ (బి) కాట్రెల్ 8, సూర్యకుమార్ నాటౌట్ 34, వెంకటేశ్ నాటౌట్ 24, ఎక్స్‌ట్రాలు :4, మొత్తం :(18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : కాట్రెల్ 4-0-35-1, షెఫర్డ్ 3-0-24-0, స్మిత్ 2-0-31-0, అకీల్ 4-0-34-0, ఛేజ్ 4-0-14-2, అలెన్ 1.5-0-23-1.