Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో వన్డేలోనూ అమ్మాయిల ఓటమి
క్వీన్స్టౌన్ : భారత మహిళల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఏకైక టీ20 సహా వరుసగా మూడో వన్డేలోనూ మిథాలీసేన దారుణ పరాజయం చవిచూసింది. హ్యాట్రిక్ వన్డేల్లో గెలుపొందిన న్యూజిలాండ్ అమ్మాయిలు మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో 280 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారీ ఛేదనలో అమేలి ఖేర్ (67, 80 బంతుల్లో 8 ఫోర్లు), లారెన్ డౌన్ (64 నాటౌట్, 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కివీస్‌కు విజయాన్ని కట్టబెట్టారు. అమీ (59), మార్టిన్ (35) రాణించారు. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (3/47) విజృంభించటంతో న్యూజిలాండ్ 171/6తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. సోఫి (0), సుజి (5), గ్రీన్ 924), లీ టహుహు (1) విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్లో లారెన్ డౌన్, మార్టిన్ ధనాధన్ షో చూపించటంతో న్యూజిలాండ్ అనూహ్య విజయం అందుకుంది. తోకను కత్తిరించటంలో విఫలమైన భారత్ సిరీస్ ఆశలను ఆవిరి చేసుకుంది. సబ్బినేని మేఘన (61, 41 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (69, 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో తొలుత భారత్ 279 పరుగులు చేసింది. తెలుగమ్మాయి మేఘన 9 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడింది. కివీస్ టూర్లో భీకర ఫామ్ కొనసాగించింది. షెఫాలీ వర్మ (51, 57 బంతుల్లో 7 ఫోర్లు) సైతం అదరగొట్టింది. మేఘన, షెఫాలీ తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. యస్టికా భాటియా (19), మిథాలీ రాజ్ (23), హర్మన్‌ప్రీత్ కౌర్ (13) వైఫల్యంతో భారత్ భారీ స్కోరు అవకాశాలను చేజార్చుకుంది. స్నేV్‌ా రాణా (11), తానియా (8), ఏక్తా బిస్త్ (3) విఫలమయ్యారు.