Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లు టీ20లకు దూరమయ్యారు. వెస్టిండీస్‌తో రెండో టీ20 అనంతరం కోహ్లి, పంత్‌లు జట్టు బయో బబుల్‌ను వీడారు. శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు సైతం కోహ్లి, పంత్ అందుబాటులో ఉండటం లేదు. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు రొటేషన్‌లో విశ్రాంతి ఇస్తున్న సెలక్షన్ కమిటీ.. టెస్టు సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లకు విలువైన సమయం ఇచ్చింది. మొహాలీలో కెరీర్ వందో టెస్టు ఆడనున్న విరాట్ కోహ్లి కుటుంబంతో గడిపేం దుకు కోల్‌కత నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు రవీంద్ర జడేజా, సంజు శాంసన్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. శ్రీలంకతో టీ20 సిరీస్ లక్నోలో ఫిబ్రవరి 24 నుంచి ఆరంభం కానుంది.