Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ హర్షం
హైదరాబాద్ : 40 ఏండ్ల విరామం అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రతిష్టాత్మక సమావేశానికి భారత్ వేదిక కానుంది. ఐఓసీ 2023 ఒలింపిక్ సెషన్ (జనరల్ మీటింగ్)కు ముంబయి నగరం వేదిక కానుంది. ఈ మేరకు బీజింగ్‌లో ఐఓసీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఒలింపిక్ సెషన్ ఆతిథ్య దేశంగా భారత్‌కు ఎంచుకుంది. 2019లో ముంబయిలో పర్యటించిన ఐఓసీ ప్రతినిధుల బృందం.. ఒలింపిక్ సెషన్ ఆతిథ్య నగర క్యాండిడేట్ సిటీగా ముంబయిని ఎంపిక చేసింది. ఒలింపిక్ సెషన్‌తో భారత్‌లో ఒలింపిక్ శోభ రానుందని, త్వరలోనే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం సైతం ఇచ్చేందుకు ఇది కీలక అడుగని ఐఓసీ మెంబర్, భారత ప్రతినిధి నీతా అంబాని తెలిపారు. ' 4 దశాబ్దాల అనంతరం ఐఓసీ సెషన్‌కు ఆతిథ్యం ఇవ్వటం సంతోషం. భారత్‌లో ఒలింపిక్ సందడికి ఇది తొలి మెట్టు' అని జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఐఓసీ ఒలింపిక్ సెషన్ నిర్వహించనున్నారు.