Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహాకు వాట్సాప్ మెసెజ్ వివాదం
ముంబయి : వృద్దిమాన్ సాహాను అవమాన పరుస్తూ వాట్సాప్ సందేశాలు పంపిన పాత్రికేయుడిపై బీసీసీఐ చర్యలు తీసుకోనుంది. దక్షిణాఫ్రికా పర్యటన ముగింపులో సాహాతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మలు జరిపిన సంభాషణలను తాజాగా వృద్దిమాన్ సాహా వెల్లడించిన సంగతి తెలిసిందే. స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సాహాను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ కోసం ఓ క్రీడా పాత్రికేయుడు సాహాకు వాట్సాప్ సందేశం పంపించాడు. ఆ సందేశాలకు సాహా స్పందించలేదు. దీంతో సాహాను అవమానపరిచే రీతిలో ఆ జర్నలిస్ట్ సందేశాలు పంపించాడు. జర్నలిస్ట్ పంపిన వాట్సాప్ సందేశాలను స్కీన్‌షాట్ ఫోటోను వృద్దిమాన్ సాహా ట్విట్టర్లో పెట్టాడు. సాహాకు మద్దతుగా మాజీ క్రికెటర్లు వీరెందర్ సెహ్వాగ్, హర్బజన్‌సింగ్, రవి శాస్త్రిలు ట్వీట్లు చేశారు. సాహాకు ఇబ్బందికర సందేశాలు పంపిన జర్నలిస్ట్‌పై చర్యలు తీసుకోవాలని రవిశాస్త్రి కోరారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరాడు.
సాహాతో జర్నలిస్ట్ వాట్సాప్ సందేశాలపై బీసీసీఐ విచారణకు ఆదేశించనున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో భారత క్రికెట్ వ్యవహారాలను కవర్ చేయకుండా ఆ జర్నలిస్ట్‌పై జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.