Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో ఐసీసీ కీలక ప్రకటన
దుబాయ్: మహిళల వన్డే ప్రపంచ కప్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ జరిగే క్రమంలో ఏదైనా జట్టులో ఎక్కువమంది క్రీడాకారులు కరోనాబారిన పడితే ఆ జట్టు కనీసం 9మంది ఆటగాళ్లతోనైనా బరిలోకి దిగేందుకు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ప్లేయర్స్‌ను బయో బబుల్స్‌లో ఉంచడం, బంతి బౌండరీ లైన్ దాటి వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేయడం, ఓ ప్లేయర్ కరోనా బారిన పడితే జట్టులో ప్రతి ప్లేయర్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం వంటి నిబంధనలను యధాతథంగా కొనసాగుతాయని ఐసీసీి పేర్కొంది. ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా సహా పలు జట్లలో కరోనా కేసులు నమోదై, కనీసం 11మంది ఆటగాళ్లను బరిలోకి దించలేని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనుంది. మార్చి 4న బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మార్చి 6న టీమిండియా జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది.
వన్డే ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్టికా భాటియా, స్నేV్‌ా రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్.