Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద యువతకు ఎంతో ఉపయోగం : పొన్నాల
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పేద యువతను అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగేందుకు రాజీవ్ గాంధీ అండర్-19, 20 క్రికెట్ టోర్నమెంట్ ఉపయోగపడిందని మాజీ రాజ్యసభ సభ్యులు వి హెచ్ హనుమంతరావు అన్నారు. అంబర్ పేట వాటర్ వర్క్స్ గ్రౌండ్లో రాజీవ్ గాంధీ 37వ క్రికెట్ టోర్నమెంట్‌ను పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది యువతను చిన్న వయసు నుంచే క్రీడల వైపు మళ్లించి వారికి ఉన్నతమైన శిక్షణ కల్పించి, జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపిక అయ్యే వరకు ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని అన్నారు. గతంలో సిరాజ్, హనుమాన్ విహారి లాంటి క్రీడాకారులను అందించిన ఘనత ఈ టోర్నమెంటుకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు పవన్ కుమార్, మాజీ కార్పొరేటర్ పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, ఆర్గనైజర్ శంబుల శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, పోలినేని రామ్మోహన్ రావు, షేక్ జమిర్, ప్రభాకర్, వాజిద్ హుస్సేన్, ఫరీద్, అక్బర్, సుధాకర్, సందీప్, రావుల సుధాకర్, గడ్డం లక్ష్మణ్, సద్గురు, కేశవ్, ఆబ్బు తదితర నాయకులు పాల్గొన్నారు.