Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపు
క్వీన్స్టౌన్: చివరి వన్డేలో టీమిండియా మహిళల జట్టుకు ఊరట లభించింది. న్యూజిలాండ్ మహిళలతో గురువారం జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో రాణించి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించింది. తొలుత భారత బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా 46 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 66(66బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్)కి తోడు స్మృతి మంధాన 71(9ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ 57నాటౌట్(6ఫోర్లు) టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. దీంతో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టు ఏకైక టి20తోపాటు ఐదు టి20ల సిరీస్‌లోనూ వరుసగా నాలుగు వన్డేలో ఓటమిపాలైంది. ఈ పర్యటనలో భారత్‌కు లభించిన ఏకైక విజయం ఐదో వన్డేలో గెలుపు మాత్రమే. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 4-1తో చేజిక్కించుకుంది. మార్చిలో జరిగే ఐసిసి వన్డే మహిళల ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.