Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టి20లో శ్రీలంకపై 62 పరుగుల తేడాతో గెలుపు
లక్నో: శ్రీలంకతో జరిగిన తొలి టి20లో భారత్ ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేయగల్గింది. లంక జట్టులో అసలంక(53) అర్ధసెంచరీతో రాణించగా.. ఓపెనర్ నిస్సంక(0)ను భువనేశ్వర్ గోల్డెన్ డక్ చేశాడు. భువనేశ్వర్ వేసి తొలి బంతికే నిస్సంక బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. గురువారం జరిగిన తొలి టి20లో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్లు రోహిత్-ఇషన్ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ(44), ఇషన్ కిషన్(89) కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రెండు ఓవర్లను ఆచి తూచి ఆడిన వీరు ఆ తర్వాత గేర్‌మార్చి బ్యాట్‌ను ఝుళిపించారు. మూడో ఓవర్లో ఇషన్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టగా.. మరో ఎండ్‌లో రోహిత్ కూడా చెలరేగి ఆడాడు. దీంతో పవర్ ప్లే 6ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఇషన్ టి20 కెరీర్లో ఇషన్ రెండో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాహిరు చేతిలో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ క్రీజ్‌లోకి రావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఇషన్-శ్రేయస్ కలిసి లంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. భారీ ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఏ దశలోనూ పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. తొలి బంతికే నిస్సంక(0) గోల్డెన్ డక్ కాగా.. జట్టు స్కోర్ 60 పరుగులకే చేరుకొనేసరికి 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టడంగా బౌలింగ్ చేయడంతో లంక బ్యాటర్స్ చేతులెత్తేశారు. భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్‌కు రెండేసి, చాహల్, జడేజాకు ఒక్కో వికెట్ దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇషన్ కిషన్‌కు లభించింది. రెండో టి20 ధర్మశాల వేదికగా 26న జరగనుండగా.. మూడు టి20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యతలో నిలిచింది.
కోహ్లిని వెనక్కి నెట్టిన రోహిత్..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి20ల్లో రికార్డు నెలకొల్పాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వ్యక్తిగత స్కోర్ 37 పరుగుల వద్ద విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ (బి)లాహిరు కుమార (44), ఇషన్ కిషన్(సి)జనిత్ (బి)శనక 89, శ్రేయస్ (నాటౌట్) 57, జడేజా (నాటౌట్) 3, అదనం 6. (20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 199పరుగులు.
వికెట్ల పతనం: 1/111, 2/155
బౌలింగ్: ఛమీర 4-0-42-0, కుమార 4-0-43-1, కరుణరత్నే 4-0-46-0, జయవిక్రమే 2-0-15-0, వాండెర్సీ 4-0-34-0, శనక (2-0-19-1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిస్సంక (బి)భువనేశ్వర్ 0, కమిల్ మిశ్రా (సి)రోహితత్(బి)భువనేశ్వర్ 13, జనిత్ లియనాగే (సి)సంజు (బి)వెంకటేశ్ అయ్యర్ 11, అసలంక (నాటౌట్) 53, చండీమాల్ (స్టంప్)ఇషన్ (బి)జడేజా 10, శనక (సి)భువనేశ్వర్ (బి)చాహల్ 3, కరుణరత్నే (సి)ఇషన్ (బి)వెంకటేశ్ అయ్యర్ 21, ఛమీర (నాటౌట్) 24, అదనం 2. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 137 పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/15, 3/36, 4/51, 5/60, 6/97
బౌలింగ్: భువనేశ్వర్ 2-0-9-2, బుమ్రా 3-0-19-0, హర్షల్ పటేల్ 2-0-10-0, చాహల్ 3-0-11-1, వెంకటేశ్ అయ్యర్ 3-0-36-2, జడేజా 4-0-28-1, హుడా 3-0-24-0.