Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతున్నది. ఓమన్ వేదికగా ఈ నెలారంభంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. శనివారం కళింగ స్టేడియంలో జరిగిన పోరులో 2-1తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. హౌరాహౌరీగా సాగిన పోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్ స్పెయిన్‌కు మన అమ్మాయిలు షాకిచ్చారు. భారత్ తరఫున జ్యోతి, నేహ చెరో గోల్ సాధించగా.. స్పెయిన్ తరఫున మార్టా సెగు ఏకైక్ గోల్ నమోదు చేసింది. ఆదివారం ఇక్కడే జరుగనున్న రెండో మ్యాచ్‌లో మరోమారు స్పెయిన్‌తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న భారత్ తలపడనుంది. మ్యాచ్ ఆరంభంలో స్పెయిన్ దూకుడు కనబర్చినా.. రెండో అర్ధభాగం నుంచి మన అమ్మాయిలు జోరందుకున్నారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి పాస్‌లతో ఆకట్టుకున్నారు.