Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొహాలీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడనున్న ప్రతిష్ఠాత్మక వందో టెస్టు ఖాళీ మైదానంలోనే జరుగనుంది. కెరీర్లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన విరాట్.. వచ్చే నెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగనున్న తొలి టెస్టుతో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. కరోనా కారణంగా ఈ మ్యాచ్‌కు అభిమానులను అనుమతించడం లేదని పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ (పీసీఏ) శనివారం స్పష్టం చేసింది. 'మైలురాయి మ్యాచ్ ఆడుతున్న విరాట్‌ను ప్రత్యేకంగా సన్మానించనున్నాం. మొహాలీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. మైదానం సిబ్బంది మినహా ప్రేక్షకులను అనుమతించడం లేదు' అని పీసీఏ కోశాధికారి ఆర్పీ సింగ్లా తెలిపాడు.