Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీతూకు సైతం స్వర్ణం
న్యూఢిల్లీ : భారత యువ బాక్సర్, తెలంగాణ స్టార్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. 73వ స్ట్రాంజా స్మారక టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. సోఫియా (బల్గేరియా)లో ఆదివారం జరిగిన పసిడి పోరులో నిఖత్ జరీన్ ఎదురులేని ప్రదర్శన చేసింది. మూడుసార్లు యూరోపియన్ చాంపియన్‌షిప్స్ పతక విజేత తెటియాన కాబ్ (ఉక్రెయిన్)పై పంచ్‌ల వర్షం కురిపించింది. క్లీన్ పంచ్‌లు సంధించే అవకాశం తెటియాన ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రతి బౌట్లో ఆధిక్యం కోసం చెమటోడ్చిన నిఖత్ జరీన్ ఉక్రెయిన్ బాక్సర్‌ను చిత్తు చేసింది. స్ట్రాంజా స్మారక టోర్నీలో రెండోసారి స్వర్ణ పతకం అందుకుంది. 2019లో సైతం నిఖత్ జరీన్ ఇక్కడ పసిడి పతకం కైవసం చేసుకుంది. మహిళల 52 కేజీల విభాగంలో పసిడి విజేతగా నిలిచింది. మరో భారత యువ బాక్సర్ నీతూ సైతం ఇక్కడ పసిడి గెల్చుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ పతక విజేత ఎరికా (ఇటలీ)పై 5-0తో ఏకపక్ష విజయం నమోదు చేసింది.