Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో టీ20లో భారత్ ఘన విజయం
- ఛేదనలో శ్రేయస్ ధనాధన్ షో
- రాణించిన అవేశ్, రవి బిష్ణోరు
పొట్టి ఫార్మాట్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టీ20ల్లో వరుసగా 11వ సిరీస్ విజయం సాధించిన టీమ్ ఇండియా.. సొంతగడ్డపై వరుసగా రెండో క్లీన్‌స్వీప్ చేసింది. విండీస్‌ను సున్నా చుట్టేసిన భారత్.. తాజాగా శ్రీలంకకు వైట్‌వాష్ ఓటమి రుచి చూపించింది. శ్రేయస్ అయ్యర్ అర్థ సెంచరీతో కదం తొక్కటంతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీ20 సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన అయ్యర్ భారత్ విజయం లాంఛనం చేశాడు.
నవతెలంగాణ-ధర్మశాల
శ్రేయస్ అయ్యర్ (73 నాటౌట్, 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) శివ మెత్తాడు. 147 పరుగుల ఛేదనలో అజేయ అర్థ సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్ భారత్‌కు క్లీన్‌స్వీప్ విజయాన్ని అందించాడు. అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో శ్రీలంకతో మూడో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రవీంద్ర జడేజా (22 నాటౌట్, 15 బంతుల్లో 3 ఫోర్లు), దీపక్ హుడా (21, 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), సంజు శాంసన్ (18, 12 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఈ విజయంతో టీ20 సిరీస్ 3-0తో భారత్ వశమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 146/5 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ కెప్టెన్ ధశున్ శనక (74 నాటౌట్, 38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శ్రీలంకను ఆదుకున్నాడు. సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అజేయంగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
అయ్యర్ అదుర్స్ : 147 పరుగుల ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (5) మరోసారి నిరాశపరిచాడు. కంకషన్తో దూరమైన కిషన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ (18, 12 బంతుల్లో 3 ఫోర్లు) మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దీపక్ హుడా (21, 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్ జోరు చూపించే ప్రయత్నం చేశాడు. నం.3 బ్యాటర్‌గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ (73 నాటౌట్) పొట్టి ఫార్మాట్లో సూపర్ ఫామ్ కొనసాగించాడు. వస్తూనే బౌండరీలపై విరుచుకుపడ్డాడు. రవీంద్ర జడేజా (22 నాటౌట్)తో కలిసి అయ్యర్ మరోసారి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సిరీస్‌లో వరుసగా మూడో అర ్థసెంచరీ బాదిన అయ్యర్.. ముచ్చటగా మూడోసారి లంక బౌలర్లకు వికెట్ నిరాకరించాడు. ఈ జోడీ లంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొంది. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే లాంఛనం ముగించింది.
ఆదుకున్న శనక : టాస్ నెగ్గిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసినా భంగపడిన లంకేయులు మరోసారి తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల వేటకే సిద్ధపడ్డారు. ఫామ్‌లో ఉన్న టాప్ ఆర్డర్‌ను కకావికలం చేసిన భారత బౌలర్లు శ్రీలంకను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. నిశాంక (1), గుణతిలక (0), అసలంక (4) సహా జానిత్ లియానగె (9)లు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. 60 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో శ్రీలంక వంద పరుగులు చేసినా గొప్పే అనిపించింది. లోయర్ ఆర్డర్లో కెప్టెన్ ధశున్ శనక (74 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. దినేశ్ చండిమాల్ (22, 27 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయగా.. శనక బౌండరీలపై విరుచుకుపడ్డాడు. 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ధనాధన్ మోత మోగించాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. శనక చెలరేగటంతో శ్రీలంక 146 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. సుదీర్ఘ విరామం అనంతరం తుది జట్టులోకి వచ్చిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (0/22) బ్యాటర్లను కట్టడి చేసినా వికెట్లు దక్కించుకోలేదు. పేసర్ అవేశ్ ఖాన్ (2/23) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సిరాజ్, బిష్ణోరు, హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
శ్రీలంక ఇన్నింగ్స్ : పథుమ్ నిశాంక (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) అవేశ్ ఖాన్ 1, ధనుష్క గుణతిలక (బి) మహ్మద్ సిరాజ్ 0, చరిత్ అసలంక (సి) సంజు శాంసన్ (బి) అవేశ్ ఖాన్ 4, జానిత్ లియానగె (బి) రవి బిష్ణోరు 9, దినేశ్ చండిమాల్ (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) హర్షల్ పటేల్ 22, ధశున్ శనక నాటౌట్ 74, చామిక కరుణరత్నె నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు : 24, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 146.
వికెట్ల పతనం : 1-1, 2-5, 3-11, 4-29, 5-60.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 4-0-22-1, అవేశ్ ఖాన్ 4-1-23-2, హర్షల్ పటేల్ 4-0-29-1, కుల్దీప్ యాదవ్ 4-0-22-0, రవి బిష్ణోరు 4-0-32-1.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) చండిమాల్ (బి) కరుణరత్నె 18, రోహిత్ శర్మ (సి) కరుణరత్నె (బి) చమీరా 5, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 73, దీపక్ హుడా (బి) కుమార 21, వెంకటేశ్ అయ్యర్ (సి) జయవిక్రమ (బి) కుమార 5, రవీంద్ర జడేజా నాటౌట్ 22, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (16.5 ఓవర్లలో 4 వికెట్లకు) 148.
వికెట్ల పతనం : 1-6, 2-51, 3-89, 4-103.
బౌలింగ్ : బినుర ఫెర్నాండో 4-0-35-0, దుష్మంత చమీరా 3-0-19-1, లహిరు కుమార 3.5-0-39-2, చామిక కరుణరత్నె 3.4-0-31-1, జెఫ్రీ 2.2-0-24-0.