Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: జాతీయ బాలికల సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర, మహారాష్ట్ర జట్లు క్వార్టర్స్ చేరాయి. జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు ఈ పోటీల్లో పాల్గొన్న జట్లను కె.డి సింగ్‌బాబు స్టేడియంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 26 జట్లు, 550 మందికి పైగా ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్‌రావు వారితో ముచ్చటిస్తూ గెలుపోటములను సమానంగా చూడాలని చెప్పారు. కష్టపడే క్రీడాకారులకు తప్పకుండా మంచి భవిష్యత్త్ ఉంటుందని భరోసా ఇచ్చారు. అలానే ఈ పోటీల నిర్వహణకు అనుమతి ఇచ్చినందుకు ''సారు''కు, సహకారమందించిన భారత ఒలింపిక్ సంఘానికి జగన్ మోహన్‌రావు ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ 21-16తో మహారాష్ట్ర హ్యాండ్‌బాల్ అకాడమీపై, మహారాష్ట్ర 15-11తో పశ్చిమబెంగాల్‌పై, హరియాణా 18-14తో తెలంగాణపై, మణిపూర్ 19-13తో మధ్యప్రదేశ్‌పై నెగ్గి క్వార్టర్స్‌లో ప్రవేశించాయి.