Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: దేశ హ్యాండ్బాల్ భవిష్యత్ త్వరలోనే మారబోతుందని జాతీయ హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్రావు అన్నారు. గురువారం లక్నోలో ముగిసిన జాతీయ బాలికల సబ్ జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతగా నిలిచిన హరియాణా జట్టుకు ట్రోఫీ బహూకరించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయని అన్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీకి దీటుగా హ్యాండ్బాల్ క్రీడను అభివద్ధి చేసేందుకు కషి చేస్తున్నామని చెప్పారు. వేసవి తర్వాత ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ తొలి సీజన్ ను అట్టహాసంగా నిర్వహించబోతున్నామని.. అక్కడ నుంచి ఆధునిక భారత హ్యాండ్బాల్ చరిత్ర మొదలవుతుందని జగన్ మోహన్రావు వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివద్ధి, ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపుపై దష్టి పెట్టినట్టు జగన్ మోహన్రావు చెప్పారు.