Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వైపాక్షిక సిరీస్,
- ఐపీఎల్‌పై పీటముడి
జొహనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా క్రికెటర్లు విషమ పరీక్ష ఎదుర్కొనున్నారు. జాతీయ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లలో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సిన పరిస్థితి సఫారీ క్రికెటర్లకు తలెత్తింది. మార్చి 26న ఐపీఎల్ 15 ఆరంభం కానుంది. ఇదే సమయంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్ మార్చి 23తో ముగియనుండగా.. టెస్టు సిరీస్ ఏప్రిల్ 12న ముగియనుంది. ఐపీఎల్ బయో బబుల్‌లోకి ప్రవేశానికి మూడు రోజుల కఠిన క్వారంటైన్ నిబంధనలు విధించారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం సఫారీ క్రికెటర్లు స్వదేశంలోనే ఉండిపోతే.. ఐపీఎల్ మెజార్టీ సీజన్‌కు దూరమవుతారు. కగిసో రబాడ, ఎన్రిచ్ నోకియా, లుంగిసాని ఎంగిడి, మార్కో జెన్సెన్, ఎడెన్ మార్కరం, డుసెన్, డెవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరిస్, క్వింటన్ డికాక్‌లు ఐపీఎల్ ప్రాంఛైజీల్లో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. సఫారీ ఆటగాళ్ల గైర్హాజరీ ఐపీఎల్ జట్లపై గట్టి ప్రభావం చూపుతుంది. జాతీయ జట్టు, ఐపీఎల్‌పై తేల్చుకునే సమయంలో ఆటగాళ్ల విధేయత బయటపడుతుందని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గార్ అన్నాడు. టెస్టు సిరీస్‌లో ఆడటం, ఐపీఎల్‌కు వెళ్లటంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు స్వేచ్ఛను ఇచ్చింది.