Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్‌తో భారత్ పోరు నేడు
- ఐసీసీ మహిళల ప్రపంచకప్
మౌంట్ మౌంగానురు : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ తొలి సమరానికి సై అంటోంది. పొరుగు దేశం పాకిస్థాన్‌తో తొలి పోరుతో టీమ్ ఇండియా అమ్మాయిలు ఐసీసీ ప్రపంచకప్ వేటను షురూ చేయనున్నారు. పాకిస్థాన్‌తో చివరి ఐదు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు నమోదు చేసిన మిథాలీరాజ్ సేన.. నేడు ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు భారత్, పాకిస్థాన్ పోరు ఆరంభం. కెప్టెన్ మిథాలీరాజ్, స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలం. యస్టికా భాటియా, యువ సంచలనం షెఫాలీ వర్మ సైతం జోరుమీదున్నారు. మిడిల్ ఆర్డర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగుండదు. బంతితో జులన్ గోస్వామి, దీప్తి శర్మలు భారత్‌కు కీలకం కానున్నారు. పాకిస్థాన్ తరఫష్ట్రన మునీబా అలీ, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా, ఆనం అమిన్‌లు కీలకం. ఛేదనలో ఇరు జట్ల బలహీనతలను దృష్ట్యా టాస్ నెగ్గిన తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.