Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్‌లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ వేదికగా ఈనెల 13 నుంచి 16 వరకు జరిగే 32వ జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ కోసం తెలంగాణ జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఫాయిల్, ఎపీ, సబ్రె విభాగాల్లో మొత్తం 24 మంది ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. ఇందులో మురళీ, శ్రవణ్‌కుమార్, నజియా, బాబీరెడ్డి, మణికంఠ, లోకేశ్‌తో పాటు పలువురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో ఈనెల 5న తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ అంతరజిల్లాల ఫెన్సింగ్ టోర్నీ నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఫెన్సర్లను సీనియర్ టోర్నీకి పరిగణనలోకి తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, ట్రెజరర్ సందీప్ పేర్కొన్నారు.